వైయస్ జగన్ పై చంద్రబాబు కక్ష: బొత్సా

Bosta Satyanarayana
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కక్ష కట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్సా సత్యానారాయణ వ్యాఖ్యానించారు. ఓబుళాపురం గనుల వ్యవహారంలో జగన్ పై చంద్రబాబు ఆరోపణలు చేయడం అందులో భాగమేనని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనను అధికారం నుంచి దించేసినందుకే చంద్రబాబు జగన్ పై కక్ష కట్టారని ఆయన అన్నారు.

ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా చంద్రబాబు వ్యక్తులను లక్ష్యంగా ఎంచుకున్నారని, చంద్రబాబుకు వ్యవస్థ కన్నా వ్యక్తులే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు రేపు మాట మారుస్తారని ఆయన అన్నారు. సిబిఐ విచారణ జరిపిస్తే చంద్రబాబు, గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం బయట పడుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+