పెషావర్: పాకిస్తాన్ లో పెషావర్ పేలుళ్లతో నిత్యం దద్ధరిల్లుతూనే ఉంది. తాజాగా శనివారం సాయంత్రం పేషావర్ లో పేలుడు సంభవించింది. పెషావర్ లోని పుస్కఖరా చౌక్ లో ఈ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఏడుగురు మరణించినట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు.
పోలీసు చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఈ పేలుడుకు ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు.