విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయేషా కేసులో పోలీసుల సాక్ష్యాల నమోదు

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: నిమ్రా కళాశాల బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసులో (అప్పటి) ఇబ్రహీంపట్నం ఎస్‌ ఐ శ్రీనివాస్‌, సీఐ మురళీమోహన్‌ల సాక్ష్యాలను మహిళా సెషన్స్‌ జడ్జి నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం దుర్గాహాస్టల్‌లో 2007 డిసెంబరు 26న ఆయేషామీరాపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ కేసులో నిందితుడికి సంబంధించి ఆధారాలు లేవని అప్పటి నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మొదట ప్రకటించారు. నందిగామ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అరెస్టు అయిన సత్యంబాబు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ కేసులో అతడిని నిందితుడిగా అరెస్టు చేశారు. ఆయేషా కేసు ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కోర్టు 28 సాక్షులను విచారించింది. దర్యాప్తు అధికారుల విచారణకు కేసు వాయిదాపడింది. సోమవారం ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో అప్పుడు ఎస్‌ఐ, సీఐలుగా పనిచేసిన వారిని కోర్టులో విచారించారు. మంగళవారం నందిగామ డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, వెస్ట్‌ ఎసీపీ (అప్పటి) ఎల్‌ విజయ్‌కుమార్‌ల సాక్ష్యాలను కోర్టులో విచారణ చేపడతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X