'చెత్త' సమస్యపై పురంధేశ్వరి దృష్టి

చెత్త బదలాయింపుపై కౌన్సిల్‌లో తీర్మానమే చేయలేదని మేయరు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన దొరబాబు స్టాండింగ్ కౌన్సిల్‌లో ఆమోదించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ వివాదంపై ఇప్పటికే మేయరు, డిప్యూటీ మేయరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో నగరకాంగ్రెస్ పరువు రోడ్డున పడింది. దీనిపై ఇన్‌చార్జి మంత్రి కన్నా లక్ష్మినారాయణ, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల వద్ద ఇప్పటికే పంచాయితీ జరిగింది. వివాదం కొలిక్కి రాకపోవడంతో చివరకు పురంధేశ్వరి వద్దకు చేరింది. దీనిపై ఆమె ఎలా స్పందించారన్న దానిపై వివరాలు బయటకు రాలేదు. ఇదిలా వుండగా ఈనెల 25న ముఖ్యమంత్రి రోశయ్య నగర పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నగరానికి చెందిన శాసనసభ్యులు, పార్టీకార్పొరేటర్లతో సమావేశమై చెత్త వివాదానికి తెరదించనున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications