రోశయ్యను ఒఎంసి జీతగాడంటాం: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయకపోతే ముఖ్యమంత్రి కె. రోశయ్యను కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) జీతగాడిగా భావిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రోశయ్యపై తాను గతంలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రోశయ్య కేంద్రం జీతగాడని ఆయన వ్యాఖ్యానించారు. తన హయాంలోని అవినీతి, అక్రమాల ఆరోపణలపై వంద విచారణలు వేసినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము గెలిచినా రాజీనామా చేయాలని తాము రోశయ్యను అడగబోమని ఆయన అన్నారు. రోశయ్య రాజీనామా వల్ల సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అవినీతికి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోశయ్యపై రాగద్వేషాలకు అతీతంగా ప్రజల ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నా మరొకరు ఉన్నా అవినీతిపై పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+