హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నివురు గప్పిన నిప్పులా వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శిబిరం నివురు గప్పిన నిప్పులానే ఉన్నట్లుంది. ఆ విషయం కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం సందర్భంగా కూడా బయట పడింది. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహించే ఉద్దేశంతో మౌనంగా ఉన్నారే తప్ప వారి అసమ్మతి తగ్గలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె.రోశయ్య నాయకత్వంపై వారు నిరంతరం పోరాటం చేసే దీశలోనే సాగే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ సూచన మేరకు సిఎల్పీ నేతగా రోశయ్య పేరును జగన్ ప్రతిపాదించినా తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే లక్ష్యంతోనే ఆయన ముందుకు సాగనున్నట్లు చెబుతున్నారు. సిఎల్పీ సమావేశంలో నోరు విప్పవిద్దని జగన్ ముందే తన వీరవిధేయులకు సూచనవలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే వారు ఏమీ మాట్లాడలేదని అంటున్నారు.

సమావేశం తర్వాత శాసనసభ్యులు కొండా సురేఖ, ఆనం వివేకానంద రెడ్డి మాట్లాడిన తీరు జగన్ శిబిరం వెనక్కి తగ్గడానికి ఏ మాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల లోపే వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని కొండా సురేఖ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపించిందని ఆమె అన్నారు. దీన్ని బట్టి జగన్ శిబిరం ముఖ్యమంత్రి పదవిపై పట్టుదలతోనే ఉన్నట్లు అర్థమవుతోంది. జగన్ సిఎం కావాలని తాము ఇప్పటికీ కోరుకుంటున్నామని మరో శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. 90 శాతం మంది శాసనసభ్యులు జగన్ సిఎం కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం శుక్రవారం సిఎల్పీ సమావేశం ఏర్పాటుకు తాత్కాలికంగా కుదిర్చిన సంధే తప్ప దీర్ష కాలం సయోధ్య సాధ్యమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X