కాటన్ మనవడు రాబర్ట్ దంపతుల పులకింత

ఆది వారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్ మ్యూజియంలో రాబర్ట్ చార్లెస్ కాట న్ దంపతులకు ఘన సన్మానం జరిగిం ది. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రు లు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ అరుణ్‌కుమార్, ఎమ్మె ల్యే రౌతు సూర్యప్రకాశరావు, కేంద్ర మాజీ మంత్రి ఎస్ బీపీబీకే సత్యనారా యణరావు తదితరులు రాబర్ట్ కాటన్ ను సన్మానించారు. మంత్రి బోస్, పొన్నాల, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లు మాట్లా డుతూ కాటన్ ఆశయాలను వైఎస్ కొనసాగించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాటన్ మ్యూజి యంలో ఉన్న ఆనకట్ట నమూనాలను, కాటన్ ఉపయోగించిన వస్తువులను, ఇంజనీరింగ్ సామగ్రిని రాబర్ట్ దంప తులు చూసి గర్వంగా ఫీలయ్యారు.












Click it and Unblock the Notifications