జైలులోనే దీక్ష కొనసాగిస్తున్నా: కెసిఆర్

K Chandrasekhar Rao
ఖమ్మం: ప్రభుత్వ ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె.చంద్రశేఖరరావు తెలిపారు. రాత్రి నుంచి మందులు తీసుకోలేదని, సెలైన్‌ తీసేసినట్లు ఆయన వెల్లడించారు. ఖమ్మం ఆసుపత్రిలోనే కేసీఆర్‌కు వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆమరణదీక్ష విరమించినట్లు వచ్చిన వార్తలను ఖండించిన కేసీఆర్‌ ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.

జైలు నుంచి విడుదలయ్యాక పోరాటం ఉధృతం చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. తాను దీక్ష విరమించలేదని, పోలీసులే తనచేత దీక్ష విరమింపజేశారన్నారు. ఉద్యమంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల చొప్పున ఇవ్వలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ సాధించేంతవరకు ఎన్నాళ్లైనా జైలు జీవితం గడుపుతాన్నారు. బెయిలు దరఖాస్తు పెట్టలేదని, పెట్టనని కూడా ఆయన చెప్పారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.తనపై ప్రజాగాయకుడు గద్దర్‌ చేసిన విమర్శలను కెసిఆర్‌ తప్పుపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+