దుమారం: కెసిఆర్ దీక్ష కొనసాగింపు

సోమవారం సాయంత్రం పోలీసులు కెసిఆర్ ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పండ్ల రసం ఇచ్చి ఆయన చేత దీక్ష విరమింపజేశారు. వెంటనే కెసిఆర్ పై ప్రజా గాయకుడు గద్దర్ తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించారు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కెసిఆర్ కు వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు తనను గొర్రెలా తీసుకెళ్లారని, బలవంతంగా తన చేత దీక్ష విరమింపజేశారని ఆయన విమర్శించారు. గద్దర్ వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. అయినా నిరసనలు తగ్గలేదు. దీంతో ఆయన మంగళవారం ఉదయం తిరిగి తన దీక్షను ప్రారంభించారు. రాత్రి నుంచే ఆయన తిరిగి దీక్షను కొనసాగిస్తున్నారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
తాను ప్రతిఘటించిన దృశ్యాలను మీడియాకు విడుదల చేయకుండా తాను పండ్ల రసం తీసుకుంటున్న దృశ్యాలను విడుదల చేసి ప్రభుత్వం కుట్ర చేసిందని కెసిఆర్ అన్నారు. తన నిజాయితీని నిరూపించుకుంటానని ఆయన చెప్పారు. తాను బెయిల్ తీసుకోనని ఆయన చెప్పారు. తనను హైదరాబాద్ గానీ వరంగల్ గానీ మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications