కె చంద్రశేఖర రావు ఢిల్లీకి రావాలి: కాంగ్రెసు సీనియర్లు
State
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి దీక్ష విరమించి ఢిల్లీకి రావాలని కాంగ్రెసు సీనియర్లు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సభ్యుడు కె. కేశవరారు తదితరులు బుధవారం రాత్రి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.తెలంగాణ అంశంపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వారు ప్రణబ్ ముఖర్జీకి వివరించారు. తెలంగాణ అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీలను వారు కోరారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని, రాజ్యాంగ పరిధిలో తెలంగాణకు పరిష్కారం కనుక్కోవడం అవసరమని కేశవరావు చెప్పారు.
తెలంగాణ అంశం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిందని, తెలంగాణపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు చెప్పారు. మరోసారి తాము ప్రణబ్ ముఖర్జీ కలుస్తామని కేశవరావు గురువారం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తో కెసిఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి గురువారం ప్రధాని మన్మోహన్ కు వివరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.