రెండు తలల పాము 8 లక్షల విక్రయం?

Snakes
తిరువూరు: అరుదుగా లభించే రెండు తలల పామును తిరువూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా అధిక ధరకు విక్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. సేకరించిన వివరాల ప్రకారం.. నవంబరు 26న గంపలగూడెం మార్కెట్‌ యార్డులో ధాన్యం బస్తాలను గోడవున్‌కు తరలిస్తుండగా రెండు తలల పాము ముఠా కూలీల కంటపడింది. వెంటనే కూలీలు ఈ పామును బయటికి తీసుకెళ్లడానికి యత్నించగా సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహిస్తున్న బండి శ్రీను అభ్యంతరం తెలిపాడు.

యార్డులో ఏ వస్తువునైనా బయటికి తీసుకెళ్లడానికి మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నరహరికి తెలియజేయాలని చెప్పాడు. దీంతో పామును కూలీలు అతనికి అందించారు. తర్వాత పాము ఏమైందీ ఎవరూ పట్టించుకోలేదు. అయితే పామును సుమారు రూ.8 లక్షలకు బెంగుళూరుకు చెందిన ఒక ఔషధ సంస్థకు విక్రయించినట్లు సమాచారం. పాము ఒకటిన్నర అడుగుల పొడవు, రెండున్నర కిలోల బరువు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నరహరిని 'న్యూస్‌లైన్‌' వివరణ కోరగా, తనకు సెక్యూరిటీ గార్డు రెండు తలల పాము విషయం చెప్పలేదని, ఆరోజు సెలవులో ఉన్నట్లు వివరించారు.

సెక్యూరిటీ గార్డు శ్రీను మాత్రం తాను కార్యదర్శికి వెంటనే సమాచారం ఇచ్చానని తెలిపాడు. అది అంత విలువైనది కానందున వదిలివేయమని అధికారులు చెప్పారని ఒకసారి, పామును గోనెసంచిలో ఉంచగా సంచిని కొరికి పారిపోయిందంటూ పొంతన లేకుండా సమాధానమిస్తున్నాడు. పరస్పర విరుద్ధమైన వివరణలు రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు తలల పాము విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని పలువురు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+