నిమ్స్ లో ఐసియుకు కెసిఆర్ తరలింపు

వైద్యం తీసుకోవడానికి కూడా కెసిఆర్ నిరాకరిస్తున్నారని, తనను బలవంత పెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. ఐసియుకు తరలించడం తప్ప మరో మార్గం లేదని అంటున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లో చిన్నపిల్లలు కూడా రోడ్ల మీదికి వచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణ అగ్ని గుండంగా మారుతోందని ఆయన చెప్పారు. రజకులు బట్టలు ఉతకడం లేదని, నాయీ బ్మాహ్మణులు క్షవరాలు చేయడం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు ఆగడం లేదని ఆయన అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కదలడం లేదని ఆయన విమర్శించారు.