ఇద్దరు ఆత్మహత్య, మహిళ ఆత్మహత్యా యత్నం

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్య పరంపరలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ఠ్ర ఏర్పాటు పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, తెలంగాణ రాష్ట్ర సమతి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆరోగ్యం క్షీణించినందుకు మనస్తాపం చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోగా, ఒక మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రభాకర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కరీంనగర్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకుని ఇప్పటి వరకు ముగ్గరు మరణించారు. ఇదే జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కట్కూరులో ఒక గృహిణి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను వరంగల్ లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.

వరంగల్ జిల్లాలో కూడా తాజాగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వర్మిడి గ్రామంలో నిరంజన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరెంట్ తీగెలు పట్టుకుని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వరంగల్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య మూడుకు చేరింది. ఇంతకు ముందు ప్రవీణ్, రాజేందర్ అనే యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంతో కరీంనగర్, వరంగల్ జిల్లాలు అట్టుడుకుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+