వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ: 96 మంది ఎమ్మెల్యేల రాజీనామా

తాజాగా మరో ముగ్గురు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో ఈ సంఖ్య 96కు చేరుకున్నట్లైంది. మొత్తం 56 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయగా టీడీపీ నుంచి 29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా పీఆర్పీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.
కాగా దేశ ప్రయోజనాల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీర్మానానికి కాంగ్రెస్ అధిష్టానవర్గం అంగీకరించిందని సోనియా గాంధీ తెలంగాణేతర ఎంపీల సమావేశంలో చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంపై మళ్ళీ చర్చిద్దామని చెప్పిన ఆమె అప్పటివరకు అధిష్టానవర్గం చెప్పినట్టు నడుచుకోవాలని ఆమె సూచించారు.