17 మంది మంత్రుల మంత్రులు రాజీనామా

తమ ప్రాంతాల ప్రజలు, తమ శాసనసభ్యుల ఒత్తిడి మేరకు తాము రాజీనామా చేస్తున్నట్లు ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అన్ని పార్టీల నాయకులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు అందరూ ఉద్వేగానికి లోనయ్యారని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు రాజీనామాలు చేశారని, తాము కూడా ఈ స్థితిలో రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటనకు తాము కట్టుబడి ఉంటామని, ఎఐసిసి ఆమోదంతోనే వైయస్ గతంలో ఆ ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నామని ఆయన చెప్పారు. తాము సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ తాజా పరిణామంతో తెలంగాణ మంత్రులు కీలక మంతనాల్లో మునిగిపోయారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితిని గమనిస్తోంది. ఆ సంక్షోభాన్ని పరిష్కరించాల్సింది కేంద్రమేనని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు.












Click it and Unblock the Notifications