సీమ, కోస్తాల్లో రెండో రోజూ బంద్

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో బంద్ సాగుతోంది. వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. విజయనగరం జిల్లాలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. గోదావరి జిల్లాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలోనూ బంద్ ప్రభావం కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ కార్యదర్శి పిళ్లై దిష్టిబొమ్మను గుంటూరు జిల్లాలో దగ్ధం చేశారు. రాయలసీమలో కూడా బంద్ ప్రభావం కనిపిస్తోంది. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థుల పిలువు మేరకు తిరుపతిలో బంద్ సాగుతోంది. చిత్తూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు రద్దయ్యాయి. చిత్తూరు జిల్లాలో కమ్మవారి పల్లెలో ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.












Click it and Unblock the Notifications