నేనూ రాజీనామా చేయాల్సి వస్తుంది: సిఎం

Rosaiah
హైదరాబాద్: మీరు రాజీనామా చేస్తే తాను రాజీనామా చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కె. రోశయ్య ముగ్గురు మంత్రులతో కూడిన సీమాంధ్ర ప్రతినిధి బృందంతో అన్నారు. ఈ విషయాన్ని ఆలోచించుకుని తమకు సాయంత్రంలోగా చెప్పాలని ఆయన చెప్పారు. తాము రాజీనామా చేయాలనుకుంటున్నట్లు చెప్పడానికి రాయలసీమ, కోస్తా మంత్రులు తమ దూతలుగా ధర్మాన ప్రసాదరావు, శిల్పా మోహన్ రెడ్డి, గాదె వెంకట రెడ్డిలను రోశయ్య వద్దకు పంపారు. వారు ఆ విషయం చెప్పినప్పుడు రోశయ్య పై విధంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పరిస్థితిని కేంద్రానికి వివరించినట్లు రోశయ్య చెప్పారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

కాగా, రాష్ట్ర చరిత్రలో ఇంతటి సంక్షోభం మునుపెన్నడూ లేదు. మెజారిటీ శాసనసభ్యులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను స్పీకర్ కు సమర్పించారు. ఈ రాజీనామాలపై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే ప్రభుత్వం సంక్షోభంలో పడుతుంది. పరిస్థితిని అధిగమించడానికి కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించే అవకాశాలున్నాయి. రాష్ట్ర పరిణామాలు ఈ దిశగానే పయనిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+