ప్రాంతాలవారీగా మంత్రివర్గంలో చీలిక

తెలంగాణ, తెలంగాణేత మంత్రుల మధ్య భావోద్వేగపరమైన చీలిక కూడా వచ్చింది. ఈ స్థితిలో ఇరు ప్రాంతాల మంత్రులు కలిసి పని చేయలేని వాతావరణం ఏర్పడింది. దీంతో శనివారం మంత్రివర్గం నిట్టనిలువునా చీలి వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ స్థితిలో ముఖ్యమంత్రి రోశయ్య ముందు జాగ్రత్తగా గవర్నర్ ఎన్డీ తివారీని కలిసే అవకాశం ఉంది. శనివారం ఉదయం రోశయ్యతో శాసన మండలి చైర్మన్ చక్రపాణి కలిశారు. శాసనసభ్యుల రాజీనామా నేపథ్యంలో శాసనసభను గానీ మండలిని గానీ సజావుగా నడిపించే స్థితి లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలనే విషయంపై వారిద్దరి మధ్య మంతనాలు జరిగాయి. రోశయ్యతో కొంత మంది ఆంధ్ర మంత్రులు కూడా సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications