హైదరాబాద్: తెలంగాణ ప్రక్రియకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన శాసనసభ్యులను వాటిని వెనక్కి తీసుకోవాలని అడిగే హక్కు తనకు లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు వారు రాజీనామాలు చేశారని, వాటిని వెనక్కి తీసుకోవాలని అడిగే హక్కు తనకు లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజాభీష్టం మేరకు నిర్ణయం జరగాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సమస్యకు కాంగ్రెసు కాబట్టి, పరిష్కరించాల్సింది కూడా ఆ పార్టీయేనని ఆయన అన్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం జరగాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
తమ నిర్ణయంపై కాంగ్రెసు పార్టీ నిర్దిష్టంగా ముందుకు రావాల్సి ఉంటుందని, తాము ఏం చేయాలనే విషయాన్ని అప్పుడే నిర్ణయించుకుంటామని ఆయన అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వెల్లడిస్తామని కేంద్ర మంత్రి ఆంటోనీ తదితరులు చెప్పారని, ఆ నిర్ణయమేమిటో తెలియాల్సి ఉందని, అప్పుడు తాను ప్రతిస్పందిస్తానని ఆయన అన్నారు. ఆ నిర్ణయం కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి