మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశులవారి సుడి తిరుగుతుంది!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదలకు, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మే 8వ తేదీన మృగశిర నక్షత్రం లోకి సంచారం చేయబోతున్నాడు. మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు.

మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు

వృషభ రాశిలో ఉన్న శుక్రుడు మే 8వ తేదీ రాత్రి 9.51 నిమిషాలకు మృగశిర నక్షత్రంలో సంచారం చేసి మే 20వ తేదీ వరకు అక్కడే ఉంటారు. మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి కావడంతో ఈ మార్పు కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి ఫలితాలను చూస్తారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Venus In Mrigashira Nakshatra on may 8th Money Gains And Business Growth to three zodiac signs

సింహరాశి

మృగశిర నక్షత్రంలో కి శుక్ర సంచారం కారణంగా సింహరాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వీరికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. నిరుద్యోగంతో బాధ పడే వారికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలలో ఉన్న వారు పదోన్నతులు పొందుతారు. ఈ సమయంలో ఏ పని చేసిన ఫలితం బాగుంటుంది. ఆర్థికంగా వీరికి ఎదుగుదల ఉంటుంది.

కన్య రాశి

మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా కన్యారాశి జాతకులు సానుకూల ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో కన్యా రాశి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతులు లభిస్తాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. తక్కువ కష్టంతో కన్యారాశి వారు ఎక్కువ ఫలితాలను సాధిస్తారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులకు మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఏ పని చేసిన వీరికి సానుకూల ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితం చాలా సుఖంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఈ సమయం వీరికి సంపదలను విలాసాలను ఇస్తుంది.

గమనిక: ఇది సాధారణ జ్యోతిష్య ఫలితాలు మాత్రమే. ప్రతి వ్యక్తి జాతకం భిన్నంగా ఉంటుంది. వ్యక్తిగత సలహా కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+