The Paradise : 'ది ప్యారడైజ్' మూవీలో ప్లస్ లు.. మైనస్ లు ఇవే..!
2 గంటల 53 నిమిషాల 4 సెకన్ల పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సృష్టించిన 'ది ప్యారడైజ్' అనే ప్రపంచంలో విహరించేందుకు ప్రేక్షకులు సిద్ధం అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ప్రీమియర్స్ ప్రారంభం అయ్యాయి. నేచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల ఈ మెంటల్ మాస్ సినిమా కోసం పడిన కష్టానికి మరికొద్ది గంటల్లో ప్రేక్షకులు తీర్పు ఇవ్వనున్నారు. ఎన్నోసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ప్యారడైజ్ మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రచ్చ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్యారడైజ్ మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. రిలీజ్ కు ముందే ప్రీ బుకింగ్స్ లోనే నాని సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా నైజాంలో టికెట్ ముక్క దొరకట్లేదంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జడల్ గాడి జమానా ను చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల- నాని కాంబినేషన్, అనిరుధ్ ఇచ్చిన రెండు పాటలే ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరికి చేర్చాయి. కనీసం ట్రైలర్ కూడా లేకుండా డైరెక్ట్ గా ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఫీలింగ్ ను ఇచ్చేందుకు అంతా సిద్ధం అయింది.
అయితే ఇప్పటి వరకూ వచ్చిన పలు రివ్యూల ఆధారంగా ఈ మూవీ 1984- 85 ఆ ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ అనే ఓ ప్రాంతం చుట్టూ ఈ మూవీ నడుస్తుంది. ఇక్కడ సవారీ అనే ఓ తెగ నివాసం ఉంటుంది. ఆ తెగ లోంచి పుట్టుకొచ్చిన వాడే జడల్(నాని).. ఆ తెగ మాలిక్ సికంజా(మోహన్ బాబు) అనే నరరూప రాక్షసుడి చేతిలో నలిగిపోతుంటుంది. ఆ ప్రజలు కనీసం మనుషులం అన్న గుర్తింపు కూడా ఉండదు. ఈ క్రమంలోనే కాకుల్లా చూసే ఆ జనాలు చేసిన తిరుగుబాటే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఇక సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని.. గూస్ బంప్స్ మూమెంట్స్ కు లెక్కే లేదని సమాచారం.

సెకండాఫ్ ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సమ్మక్క సాంగ్ తో పాటు మధర్ సెంటిమెంట్ ను హైలెట్ చేస్తూ మరో సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. అలాగే ఆయాషేర్ సాంగ్ థియేటర్లలో ఎవరినీ కూర్చోనివ్వదని మాట్లాడుకుంటున్నారు. అంతేకాక ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి నాని కెరీర్ బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఫుల్ రివ్యూ కోసం మరికొద్ది గంటలు ఆగాల్సిందే. ఈ మూవీలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రాఘవ్ జురెల్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో మెరిశారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీని సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. మరికొద్ది గంటల్లో ఫుల్ రివ్యూ బయటకు రానుంది.












Click it and Unblock the Notifications
