వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిడిపితో గొంతు కలిపిన వైయస్ జగన్

కాగా, తాను సమైక్యవాదినని జగన్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక కోస్తా, ప్రత్యేక రాయలసీమ వాదాలను తాను సమర్థించబోనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. మూడు ప్రాంతాల ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత సంక్షోభానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కారణమని ఆయన విమర్శించారు. తాను తెలుగుదేశం సభ్యులకు మద్దతు పలకలేదని ఆయన స్పష్టం చేశారు. తాను బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాను గానీ ప్రత్యేక తెలంగాణ కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు మాట మార్చాయని ఆయన తప్పు పట్టారు.