వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దీక్ష కొనసాగుతుంది: వైయస్ వివేకానంద రెడ్డి

సమైక్యాంధ్రలో, విశాలాంధ్రలో మనం రాష్ట్రాభివృద్ధిని సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర కోసం దీక్ష చేయాల్సిన అవసరం రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. విశాలాంధ్రలో అభివృద్ధిని తాను కాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయం సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద దీక్ష ప్రారంభించిన వివేకానంద రెడ్డిని గోషా మహల్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన స్వస్థలం కడపకు తరలించారు. ఎక్కడికి తరలించినా తన దీక్ష సాగుతుందని వివేకానంద రెడ్డి కడపకు తరలించే సమయంలో చెప్పారు.