ఆ పని దేవుడు కూడా చేయలేడు: జెపి

Jayaprakash Narayan
హైదరాబాద్: ఒకేసారి రాష్ట్రాన్ని కలిపి ఉంచడం, విభజించడం దేవుడికి సాధ్యం కాదని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర పరిణామాల పట్ల ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు అతి పెద్ద రాజకీయ పార్టీలు ప్రస్తుత నాటకంలో ఉన్నాయని ఆయన అన్నారు. ప్రాంతీయ ఉద్యమాలను రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలకే ముందుకు తెస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగితే భూతల స్వర్గం ఏర్పడుతుందనేది భ్రమ అని, అదే సమయంలో రాష్ట్ర విడిపోతే భూకంపం వస్తుందనీ అగ్ని పర్వతాలు బద్దలవుతాయనీ అనుకోవడం కూడా భ్రమేనని ఆయన అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలిస్తే అందరి ఆమోదంతో జరగాలని ఆయన అన్నారు.

రాష్ట్రంలో 41 శిబిరాల్లో చేస్తున్న దీక్షలను సామాన్యులు విరమించుకోవాలని, రాజకీయ నాయకులు ఆడుతున్న క్రీడలో బలిపశువులు కావద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఉత్తములు సామాన్యులుగా, దుర్మార్గులు బలవంతులుగా మారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న ఉన్మాద వాతావరణ పోయి సాధారణ పరిస్థితులు నెలకొనడం అవసరమని ఆయన చెప్పారు. సమస్యను కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉంటుందని, ఇందుకు అవసరమైన ప్రకటన చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ క్రీడలో ఒకరి గెలుపు ఒకరి ఓటమి సాధ్యం కాదని ఆయన అన్నారు. రాజకీయ నాయకులకు కీర్తీ వస్తుందనీ వారి ఆరోగ్యం కుదుటపడుతందని, నష్టపోయేది సామాన్యులూ విద్యార్థులేనని ఆయన అన్నారు. పత్రికలు, టీవీలు కూడా సాధారణ వాతావరణానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత స్థితి వల్ల రాష్ట్రం దెబ్బ తింటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+