నేను బై సెక్సువల్.. పెళ్లికి ముందే అలా అంటూ బాంబ్ పేల్చిన బ్యూటీ !!

బాలీవుడ్ టెలివిజన్ నటి ఆకాంక్ష హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. హిందీ బిగ్‌బాస్ 19 విజేత గౌరవ్ ఖన్నాతో 2016లో కాన్పూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట టెలివిజన్ ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందింది. అయితే ఇటీవల ఆయనతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పుడు తనకు సంబంధించిన మరో వ్యక్తిగత విషయాన్ని బహిరంగంగా వెల్లడించి చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం ప్రముఖ రియాలిటీ షో 'లాకప్ సీజన్ 2: సచ్ యే సజా'లో పాల్గొంటున్న ఆకాంక్ష.. తన గత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

'లాకప్ 2'లో పాల్గొంటున్న ఆకాంక్ష..

జూన్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న 'లాకప్ సీజన్ 2 'కు ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో రామ్ కపూర్, శివంగి జోషి, ధీరజ్ ధూపార్, హర్షద్ చోప్రా, రియాజ్ అలీ, సూఫీ మోతివాలా, సునీతా అహుజా తదితర ప్రముఖులతో పాటు ఆకాంక్ష చమోలా కూడా కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. షోలోని టాస్క్‌లలో భాగంగా కంటెస్టెంట్లు తమ జీవితంలో ఎప్పుడూ బయట చెప్పని రహస్యాలను వెల్లడించాల్సి ఉంటుంది.

actress-akanksha-chamola-ex-wife-of-gaurav-khanna-admits-that-she-was-bisexual-before-marriage-in-lo

విడాకుల ప్రకటనతో షాక్

ఇటీవల లాకప్ సీజన్ 2లో రిలేషన్‌షిప్స్‌పై జరిగిన చర్చలో ఆకాంక్ష చమోలా సంచలన విషయం వెల్లడించారు. తాను, గౌరవ్ ఖన్నా గత ఏడాది నుంచి విడివిడిగా ఉంటున్నామని, ప్రస్తుతం విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ఇప్పటికీ పరస్పరం గౌరవించుకుంటూ మాట్లాడుకుంటున్నామని వెల్లడించారు. వీరి విడాకులకు గల అసలు కారణాలపై ఇద్దరూ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ విషయంపై గౌరవ్ ఖన్నా లేదా ఆకాంక్ష నుంచి అధికారిక ధృవీకరణ లేదు.

మరో వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టిన ఆకాంక్ష..

విడాకుల ప్రకటన తర్వాత మరోసారి లాకప్ షోలో మాట్లాడిన ఆకాంక్ష.. తన లైంగిక ఆకర్షణ (sexual orientation) గురించి కూడా బహిరంగంగా మాట్లాడారు. పెళ్లికి ముందు తాను బైసెక్సువల్‌గా తనను తాను గుర్తించేదానినని తెలిపారు. మహిళల పట్ల కూడా తనకు ఆకర్షణ ఉండేదని, గతంలో కొంతమంది అమ్మాయిలతో భావోద్వేగపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అయితే అవి శారీరక సంబంధాలు కాదని, పరస్పర అనుబంధం, భావోద్వేగాలపై ఆధారపడిన సంబంధాలేనని ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆకాంక్ష మాట్లాడుతూ.. మహిళలతో ఉంటే తనకు ఎంతో సౌకర్యంగా, భద్రంగా అనిపిస్తుందని చెప్పారు. సమాజం ఇలాంటి సంబంధాలను ఎలా చూసినా, తన దృష్టిలో అది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తికి తన భావోద్వేగాలను అర్థం చేసుకునే హక్కు ఉంటుందని, తన జీవిత అనుభవాన్ని నిజాయితీగా పంచుకున్నానని తెలిపారు. ఆకాంక్ష చమోలా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+