లగడపాటి రాజగోపాల్ ఆమరణ దీక్ష భగ్నం

లగడపాటి రాజగోపాల్ అరెస్టును నిరసిస్తూ మాజీ మండలి బుద్ధప్రసాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో బుద్ధప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ ఆధ్వర్యంలో కూడా రాస్తారోకో జరిగింది. ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగడపాటికి అరెస్టుకు నిరసనగా ఆదివారం సామూహిక సత్యాగ్రహం చేపడతామని మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేయడం సరి కాదని ఆయన అన్నారు.
దీక్ష విరమించాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ శుక్రవారం సాయంత్రం ఫోన్ చేసి లగడపాటి రాజగోపాల్ ను కోరారు. అలాగే ముఖ్యమంత్రి కె.రోశయ్య కూడా లగడపాటి రాజగోపాల్ ను పరామర్శించారు. రాష్ట్ర విభజనను ఆపేస్తామని కేంద్రం ప్రకటించే వరకు తన దీక్ష కొనసాగుతుందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు.












Click it and Unblock the Notifications