సమైక్యతకు కేంద్ర ప్రకటన: పురంధేశ్వరి ఆశ

Purandeswari
విశాఖపట్నం: సమైక్యాంధ్రకు అనుకూలంగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమ, మంగళవారాల్లో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడగలదని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారని, అందుకు ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తుందని, ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తారని, అప్పటి వరకు అది ముందుకు కదిలినట్లు కాదని ఆమె వివరించారు. రాష్ట్ర విభజన ప్రకటనతో కాంగ్రెసు పార్టీకి నిమిత్తం లేదని, ప్రభుత్వం చేసిన ప్రకటన అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత చూస్తామని కేంద్ర ప్రభుత్వంలోని అనుకుంటున్నారని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. రాష్ట్ర విభజనకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాల్సిందేనని ఆమె అన్నారు. శాసనసభలో తీర్మానం ప్రతిపాదించే దాకా తాము బిల్లు ప్రతిపాదించేది లేదని కేంద్ర మంత్రులు చెబుతున్నారని, రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగలేదని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+