అనంతపురం: సమైక్యాంధ్ర కోసం అవసరమైతే తాను ఢిల్లీ వెళ్తానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు. పార్టీలకు అతీతంగా సమైక్యాంధ్ర కోసం ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి వెళ్లే ప్రతినిధి బృందంతో తాను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన సోమవారం అనంతపురం వచ్చారు. తెలంగాణ ప్రక్రియ నిర్ణయంపై పునరాలోచన చేసి నిర్దిష్టమైన ప్రకటన చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో ప్రభుత్వ పెద్దల అపాయింట్ మెంటు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని, తాము యుపిఎ భాగస్వామ్య పక్షాల నాయకులను కూడా కలుస్తామని ఆయన చెప్పారు.
సమైక్యాంధ్ర ఉద్యమానికి అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు స్ఫూర్తిగా నిలిచారని ఆయన కొనియాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం అన్ని వర్గాల నుంచి స్పందన ఉందని, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన విశాఖపట్నం నుంచి ప్రశాంతి ఎక్స్ ప్రెస్సులో ఆయన ఇక్కడికి వచ్చారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి