వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాలకు వంద ఎమ్మెల్యేలు: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నుంచి వెనక్కి తగ్గితే వంద శాసనసభ్యులు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ నాయకులు తెరాసలో చేరిన సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరని, వారు ఢిల్లీకి వెళ్తున్నారని, తాను వారితో మాట్లాడానని ఆయన చెప్పారు. రాజకీయ సంక్షోభం సృష్టించడం తమకు కూడా చేతనవుతుందని ఆయన కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులను ఉద్దేశించి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముసుగేసుకుని లోపల కూర్చున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఎస్కేయు విద్యార్థులు కనిపిస్తారు, ఉస్మానియా విద్యార్థులు కనిపించరా అని ఆయన అడిగారు.

తెలంగాణ ప్రజల సహనానికి పరీక్ష పెట్టద్దని ఆయన హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షిస్తే అణు విస్ఫోటం సంభవిస్తుందని ఆయన అన్నారు. ఆరు నూరైనా, తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన ఉదయించినా పట్టు విడవకూడదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు భౌగోళికమైన ఇబ్బందులేమీ లేవని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలకు పొసగలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ మా మేనమామది కాకపోతే మీ మేనమామదా అని ఆయన మోహన్ బాబును అడిగారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి దశ, దిశ లేదని, ఉమ్మడి లక్ష్యం లేదని, ఉమ్మడి నాయకుడు లేడని ఆయన తప్పు పట్టారు. లగడపాటి జగడం, కాంగ్రెసు, తెలుగుదేశం ఎవరి దారి వారిదేనని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రజల ఇక్కట్లను, తెలంగాణకు జరిగిన మోసాలను ఆయన వివరించారు. మీకు బలం ఉంటే నాకు బలగం ఉందని ఆయన కోస్తాంధ్ర, రాయలసీమ నేతలను ఉద్దేశించి అన్నారు. తమకు ఏమీ తెలియదనే పద్ధతిలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. స్వతంత్రమే అర్థరాత్రి వచ్చిందని, సమైక్యాంద్ర ఎందుకంటే చెప్పే పరిస్థితి లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఎందుకంటే చిన్న పోరగాళ్లు కూడా చెప్తారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X