న్యూఢిల్లీ: రాష్ట్ర వ్యవరాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ, ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో సీమాంధ్రా ఎంపీల భేటీ ముగిసింది. కడప ఎంపీ, జగన్మోహనరెడ్డి,కేంద్ర మంత్రి పురందేశ్వరీ, కేవీపీ, నెల్లూరు ఎంపీ మేకపాటీ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. మంగళవారం అర్ధరాత్రి భేటీ ముగిసిన అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. మేకపాటి మాట్లాడుతూ కేంద్రం వెలువడించే నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచకుని కేంద్రం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్రంపై రాష్ట్రంలోని రెండు శిబిరాల వత్తిడి ఎక్కువడంతో రెండవసారి చేసే ప్రకటన అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా ఉండాలని కేంద్రం కసరత్తు చేస్తోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి