రాంచీ: జార్ఖండ్‌లో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హంగ్ దిశగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 81 శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది. అయితే ప్రధాన పార్టీలన్ని స్పష్టమైన మెజార్టీకి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్-19, బీజేపీ-23, జేఎంఎం- 17, ఇతరులు-11, ఆర్జేడీ-8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
తూర్పు జంషెడ్‌పూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువర్ దాస్ ముందంజలో ఉండగా, డమ్కాలో మాజీ ఎంసీ శిబుసోరెన్ కుమారుడు హేమంత్ వెనుకపడ్డారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి