ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు-కర్నూలు జిల్లా నంద్యాల ఘాట్‌రోడ్డులో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో పదిమంది గాయపడ్డారు. నంద్యాల వెళుతున్న లారీ గిద్దలూరు ఘాట్‌రోడ్డులోని దిగువమెట్ట వద్ద అదుపు తప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు పెద్ద ఆరవీడు గ్రామస్తులు.