హైదరాబాద్: ముఖ్యమంత్రి చెబితే రాజీనామాలు చేయడానికి తాము నోట్లో వేలుపెట్టుకున్న చిన్నపిల్లలం కాదన్న జేసీ కళ్లలో వేలుపెట్టి పొడిచే రకమని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ నాయకులు ప్రజలు సంయమనం పాటించాలంటున్న జేసీ వ్యాఖ్యలపై దామోదర్‌రెడ్డి పై విధంగా స్పందించారు.
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఆయన చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం రాజకీయ ఉద్యమం కాదని ప్రజాస్వామ్య ఉద్యమమని చెప్పారు. అధిష్ఠాన నిర్ణయాన్ని వ్యతిరేకించి ఈ పరిస్థితికి కారణమయ్యారన్నారు.