హైదరాబాద్ సంగతి తేల్చాలంటూ జెసి డిమాండ్

రాజకీయ లబ్ధి కోసం కొందరు ప్రత్యేక వాదులుగా తయారు అవుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. రాజకీయ ఆటకు అమాయకులు బలి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాలతో కాకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే బాగుంటుందని జేసీ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిందన్నారు. రోజుకు వంద కోట్ల నష్టం వాటిల్లుతుందని, వేల, కోట్ల ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. 70 శాతం మంది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని జేసీ అన్నారు.












Click it and Unblock the Notifications