హైదరాబాద్ : గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల వల్ల రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థకు రూ.536 కోట్ల నష్టం వాటిల్లిందని రవాణాశాఖమంత్రి శత్రుచర్ల విజయరామరాజు తెలిపారు. ముఖ్యమంత్రి రోశయ్యతో సమావేశం అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. సంస్థ నష్టాల్లో కూరుకుపోయిన సమయంలో సమ్మెయోచన మంచిది కాదని ఆయన సూచించారు.