పార్టీ ఆఫీసులో తెలుగుదేశం తెలంగాణ నేతల భేటీ

నిన్న టిడిపి నేత నాగం జనార్ధనరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఒప్పిస్తామని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వైఖరిని ప్రకటించిన మరు క్షణమే తమ నేత చంద్రబాబు ప్రకటిస్తారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై కాంగ్రెసుకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా తాము కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని, తమ వైఖరి తెలంగాణపై మార్చుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లకు రహస్య ఎజెండా ఉందని, అందుకే తాము జెఎసిలో చేరడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications