ఎన్నాళ్ళకెన్నాళ్ళ కెన్నాళ్ళకు... కెసిఆర్ తో విజయశాంతి
State
oi-Santaram
By Santaram
హైదరాబాద్ : కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్న విజయశాంతి ఆదివారం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. తెలంగాణ కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత వీరు భేటీ కావటం ఇదే తొలిసారి. జేఏసీ ఏర్పాటుతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొవాలని ఎమ్మెల్యేలు విజయశాంతిని కోరిన నేపథ్యంలో ఆమె కేసీఆర్ నివాసానికి వచ్చారు.
విజయశాంతికి చెందిన మనిషి ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగుదేశం నాయకుడు నాగం జనార్ధనరెడ్డిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.