సమైక్యాంధ్ర ఉద్యమానికి బిజెపి'కౌంటర్'

BJP
విజయవాడ: ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) సమాయత్తమవుతోంది. ప్రత్యేకాంధ్ర ఉద్యమం చేపట్టడానికి అవసమైన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు మంగళవారం విజయవాడలో బిజెపి నేతలు సమావేశమవుతున్నారు. విజయవాడలో 11జిల్లాలకు చెందిన బిజెపి కార్యకర్తలు సమావేశమవుతున్నారు. రాష్ట్ర విభజన మీద ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చిచ్చు పెడుతోందని బిజెపి నాయకుడు హరిబాబు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. కేంద్రం సరైన దిశలో పయనించడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రం విడిపోయే విషయంపై ఆంధ్ర ప్రాంతంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రం విడిపోతే కలిగే లాభం ఏమిటి, నష్టం ఏమిటనే విషయంపై తెలంగాణేతర ప్రాంతంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం పేర తెలంగాణేతర ప్రాంతాలకు చెందినవారి ఆస్తులపై దాడులు సరైనవి కావని ఆయన అన్నారు. సినీ పరిశ్రమపై దాడులను కూడా ఆయన ఖండించారు. సినీ పరిశ్రమ ఒకే చోట కేంద్రీకృతం కావడం సరైంది కాదని ఆయన అన్నారు. ఆంద్ర ప్రాంతంలో కూడా సుందర ప్రదేశాలున్నాయని, ఇక్కడ షూటింగ్ లు జరగవచ్చునని ఆయన అన్నారు. తాము రెండు రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. హరిబాబు మీడియా సమావేశం జరుగుతుండగానే సమైక్యవాదులు దాడికి దిగారు. ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+