సాయంత్రం నరసింహన్ తో కెసిఆర్ భేటీ

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మంగళవారం సాయంత్రం రాష్ట్ర కొత్త గవర్నర్ ఇసిఎల్ నరసింహన్ ను కలుస్తారు. ఆయన మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు గవర్నర్ తో భేటీ అవుతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ఆయన గవర్నర్ ను కోరే అవకాశం ఉంది. అలాగే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ ను కలుస్తారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సోమవారమే నరసింహన్ ను కలిశారు.

కాగా, నరసింహన్ రాష్ట్ర పరిస్థితిపై ఇప్పటికే కేంద్ర హోం శాఖకు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి కె. రోశయ్య, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డిజిపి గిరీష్ కుమార్ లతో రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్ ఐపియస్ కేడర్ కు చెందిన నరసింహన్ తెలుగు బాగా మాట్లాడగలరు. ఆయన ఇంటెలిజన్స్ ఐజిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచేయడానికే ఆయనను గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం వేసిందనే ప్రచారం కూడా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+