కాకినాడ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన దిశగా ప్రకటన, అనంతర పరిణామాలు సంభవించి ఉండేవి కాదని రక్షణ శాఖ సహాయ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు పేర్కొన్నారు. జాతీయస్థాయి తైక్వాండో పోటీల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన సోమవారం కాకినాడలో విలేకర్లతో మాట్లాడారు. వైయస్ మరణానంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయన్నారు.
ప్రజలందరూ ఐక్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పళ్లంరాజు పేర్కొన్నారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ అభివృద్ధి చేస్తే అన్ని ప్రాంతాలకూ సమాన న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజనపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు త్వరలోనే కుదుట పడగలవన్న ఆశాభావాన్ని పళ్లంరాజు వ్యక్తం చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి