తివారీ పరువు తీసుకున్నారు: తెలంగాణ నేతలు

తివారీ ప్రకటన అర్థం లేనిదని మాజీ హోం మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె. జానారెడ్డి అన్నారు. తివారీ ఏం చేయాలో తోచక తెలంగాణవారిపై నిందలు మోపుతున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణవాదులకు రాష్ట్రపతిని కలవాల్సిన అవసరం లేదని, అందుకు తాము ఏ విధమైన విజ్ఞప్తి కూడా చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతోందనే నమ్మకం తమకు ఉందని, సాధ్యమైనంత త్వరగా అది ప్రారంభం కావాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications