డైలమాలో తెలంగాణ మంత్రులు

తెలంగాణపై తాము సానుకూలంగానే ఉన్నామని చెబుతూ రాజీనామాలు చేయడంపై తెలంగాణ మంత్రుల మీద అధిష్టానానికి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చిన తెలంగాణ మంత్రులు మంగళవారం జరిగే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసి సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. అయితే రేపటి మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలా, వద్దా అనే విషయంపై వారు డైలమాలో ఉన్నారు. మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోతే రాజీనామాలను ఆమోదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications