తెలంగాణపై తెరాస 'ప్ర్తత్యేక' వ్యూహం

సమైక్యవాద నినాదం వినిపించిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు హరీష్ రావు సవాళ్లు విసిరారు. దమ్ముంటే ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు రావాలని ఆయన వారిని సవాల్ చేశారు. సమైక్య నినాదంతో దమ్ముంటే తెలంగాణలో తిరగాలని కూడా ఆయన అన్నారు. అదే సమయంలో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు హెచ్చరికలు చేశారు. తెలంగాణకు చెందిన అధ్యాపకుల పట్ల వివక్ష ప్రదర్శిస్తే సహించేది లేదని ఆయన అన్నారు. ఈ రకంగా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదులో ఆస్తులు కూడబెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు అభద్రతకు గురయ్యే పరిస్థితిని కల్పించాలనేది తెరాస వ్యూహంగా కనిపిస్తోంది.
నిజానికి, తెలంగాణేతర ప్రాంతాలవారి హైదరాబాద్ ఆస్తులకు ఏ విధమైన నష్టం ఉండదని, వాటిని కాపాడే బాధ్యత తమదని తెరాస మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. కానీ, వారి మాటలను పట్టించుకోకుండా సమైక్యవాదం పేర కొద్ది మంది తమపై దాడికి దిగడాన్ని తెరాస సీరియస్ గా తీసుకుని, ప్రతిదాడికి దిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రతిదాడిలో భాగంగానే తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications