సిఎం క్యాంపు ఆఫీసును ఖాళీ చేసిన జగన్

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఎట్టకేలకు ఖాళీ చేశారు. ఆయన తని నివాసాన్ని సాగర్ సొసైటీలోని తన ఇంటికి మారారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన వంద రోజులకు పైగా దాటిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటూ వస్తున్నారు. అనధికారికంగా జగన్ సిఎం క్యాంపు కార్యాలయంలో ఉండడంపై ప్రశ్నించిన వారు లేరు.

ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకోవడం వల్లనే జగన్ సిఎం క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయడం లేదనే వాదన వినిపిస్తూ వస్తోంది. ఏనాటికైనా తాను ముఖ్యమంత్రిని అవుతానని ఆయన ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారు. అయితే, రాష్ట్ర విభజన ముందుకు రావడంతో దానిపై ఆశలు వదులుకుని నివాసాన్ని మార్చినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+