కోల్ కత్తా: సిపిఎం కురు వృద్ధుడు జ్యోతిబసు ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనను పూర్తి వెంటిలేషన్ మీద ఉంచారు. ముందు జాగ్రత్త చర్యగా పూర్తి వెంటిలేషన్ మీద ఉంచినట్లు ఆయన చికిత్స చేస్తున్న శుశ్రుత్ బందోపాధ్యాయ చెప్పారు. శుక్రవారం మధ్యహ్నం పాక్షికంగా మాత్రమే వెంటిలేషన్ మీద ఉంచారు.
జ్యోతిబసుకు ప్రైవేట్ ఎఎంఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జ్యోతిబసును ఇప్పటికే ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి బడా నేతలు పరామర్శించారు.