సిఎం కుర్చీ కోసం బాబు ఆరాటం: రఘువీరా రెడ్డి

Raghuveera Reddy
హైదరాబాద్: ది ఎగ్జైల్డ్ వార్తాకథనం తర్వాత చెలరేగిన విధ్వంసంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను దించేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు జగన్, కెవిపి రామచందర్ రావులపై చేసిన ఆరోపణలను చూస్తుంటే వైయస్ రాజశేఖర రెడ్డి హత్యకు గురయ్యారనే అనుమానాలకు బలం చేకూరుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. పరిటాల రవి హత్యకు గురైనప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయంలో కూర్చుని హింసను పురికొల్పారని ఆయన ఆరోపించారు.

ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు ఆందోళనల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన అన్నారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఒక వార్తాకథనాన్ని ప్రసారం చేసే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆందోళనలు కలిగించే విధంగా మీడియా వార్తాకథనాలు ప్రసారం చేయడం సరి కాదని ఆయన అన్నారు. నిరాధారమైన వార్తలు వచ్చినప్పుడు నష్టం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+