వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సీట్లో కూర్చున్న లగ్నం బాగుండలేదేమో: రోశయ్య నిర్వేదం

'రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేప«థ్యంలో తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్నాను. అందుకోసం మీకు ఎక్కువ సమయం కేటాయించ లేకపోతున్నాను. అలా అని ఉద్యోగుల డిమాండ్లు, పీఆర్సీల నుంచి తప్పుకోవడంలేదు. కమిటీల పేరుతో కాలయాపన చేసే ఉద్దేశం లేదు. ఆర్థిక పరిస్థితి సహా అన్ని విషయాలూ మీకు తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి' అని కోరారు.
ఇందుకు జేఏసీ నేతలు బదులిస్తూ.. గత నెల రోజులుగా జరుగుతున్న సంఘటనలకు ఉద్యోగులతో ముడిపెట్టవద్దని కోరారు. ఇప్పటికే ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నందున పీఆర్సీపై ఇక కాలయాపన చేయొద్దని కోరారు. సంక్రాంతికి ముందే పీఆర్సీ ఇవ్వాలని విఙ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం బదులిస్తూ పీఆర్సీ విషయమై 18, 19 తేదీల్లో పూర్తి సమయాన్ని కేటాయిస్తానని, దీనిపై నిర్ణయం కచ్చితంగా ఖరారవుతుందని చెప్పారు.