స్నానం చేస్తున్న మహిళ వీడియోల రికార్డు - ఇద్దరు క్రికెటర్ల అరెస్ట్..!!

క్రికెట్ ప్రపంచంలో సంచలనం. శ్రీలంక క్రికెట్‌లో ఓ వివాదం కలకలం రేపింది. తాము బస చేసిన హోటల్‌లో మహిళలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీశారనే ఆరోపణలపై శ్రీలంక అండర్-19 పురుషుల టీమ్ కు చెందిన ఇద్దరు క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆ తర్వాత వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంతో ఒక్క సారిగా క్రికెట్ ప్రపంచం షాక్ అయింది. పోలీసులు ఈ వ్యవహారంలో పూర్తి విచారణ చేస్తున్నారు. కొలొంబో లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది.

కొలంబోలోని నరహేన్‌పిటలో ఉన్న ఒక హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే హోటల్‌లో బస చేస్తున్న కొందరు మహిళలు, తాము బాత్రూమ్‌లో ఉండగా మొబైల్ ఫోన్లతో వీడియో తీస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ వారం మొదట్లో పోలీసులు ఆ ఇద్దరు యువ క్రికెటర్లను అదుపులోకి తీసుకున్నారు.

Two Srilanka cricketers were taken into custody after women staying at the hotel complained that they were being filmed

శ్రీలంక అండర్-19 జట్టు బస చేస్తున్న కొలంబోలోని నరహెన్‌పిట ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఇద్దరు యువ క్రికెటర్లు జట్టుతో పాటే అదే హోటల్‌లో బస చేస్తున్నారు. అయితే తాము బాత్రూంలో ఉన్నప్పుడు వీడియోలు తీశారంటూ బాధిత మహిళలు ఆరోపించారు. ఫిర్యాదు అందుకున్న నరహెన్‌పిట పోలీసులు తక్షణమే స్పందించి విచారించగా, యువ క్రికెటర్లు వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటన శ్రీలంక క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అయితే, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఆటగాళ్ల పేర్లను అధికారులు బయటకు చెప్పటం లేదు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు ఆటగాళ్లను అలుత్‌కడే మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో వారికి వ్యక్తిగత బెయిల్ మంజూరైంది. ఒక్కో ఆటగాడికి 5లక్షల శ్రీలంక రూపాయ ల (సుమారు 1,564 అమెరికన్ డాలర్లు) వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ లభించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 25కు కోర్టు వాయిదా వేసింది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) మాత్రం ఈ ఇద్దరు ఆటగాళ్లపై ఇప్పటివరకు ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటన చేయలేదు. తీసిన వీడియోలను ఏవైనా ఇతర మాధ్యమాల ద్వారా షేర్ చేసారా అనే కోణంలో నరహేన్‌పిట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు క్రికెట్ ప్రపంచం లో సంచలనంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+