త్వరలో పెట్రో ధరల పెంపు ? ఇవాళ గ్యాస్ రేట్ల పెంపు తర్వాత అదేనా..!
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తెరపైకి వచ్చిన అంశం చమురు ఉత్పత్తుల రేట్ల పెరుగుదల. ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరుగుతాయని విపక్షాలు పదే పదే ప్రస్తావించాయి. విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం కేంద్రం ఎన్నికల ముగింపు కోసం ఎదురుచూచ్తుందని చెప్పారు. విపక్షాలు చెప్పినట్లుగానే కేంద్రం ఎన్నికలు ముగియగానే ఇవాళ కమర్షియల్ గ్యాస్ రేట్లను సిలెండర్ పై ఏకంగా దాదాపు వెయ్యి రూపాయలు పెంచేసింది.
బెంగాల్ ఎన్నికలు ముగియగానే చమురు ధరలు పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసిన పెట్రోలియం శాఖ .. తాజాగా యూటర్న్ తీసుకుంది. ఎన్నికలు ముగియడంతో ఇవాళ కమర్షియల్ గ్యాస్ రేట్లు పెంచేసింది. దీనిపై స్పందించిన విపక్ష నేత రాహుల్ గాంధీ.. తాను ఈ విషయాన్ని ముందే చెప్పినట్లు గుర్తుచేశారు. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం వేడి పుంజుకుంటుందని తాను ముందే చెప్పినట్లు రాహుల్ తెలిపారు.

कह दिया था - चुनाव के बाद महंगाई की गर्मी आएगी।
— Rahul Gandhi (@RahulGandhi) May 1, 2026
आज कमर्शियल गैस सिलेंडर ₹993 महंगा। एक ही दिन में सबसे बड़ी बढ़ोतरी। यह चुनावी बिल है।
फरवरी से अब तक: ₹1,380 की बढ़ोतरी - सिर्फ़ 3 महीनों में 81% का इज़ाफ़ा।
चायवाला, ढाबा, होटल, बेकरी, हलवाई - हर किसी की रसोई पर बोझ बढ़ा। और…
ఈ రోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ₹993 పెరిగిందని, ఒక్క రోజులో ఇంత పెద్ద పెరుగుదల ఉండటం ఇదే మొదటిసారి అని రాహుల్ ట్వీట్ చేశారు. ఇది ఎన్నికల బిల్లు అన్నారు. ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు ₹1,380 పెరిగిందన్నారు. కేవలం 3 నెలల్లోనే ఏకంగా 81% పెరుగుదల నమోదైందన్నారు. టీ స్టాల్, ధాబా, హోటల్, బేకరీ, స్వీట్ షాప్ ప్రతి ఒక్కరి వంటగదిపై భారం పెరిగిందన్నారు. దీని ప్రభావం మీ ప్లేట్‌పై కూడా పడుతుందన్నారు.మొదట గ్యాస్‌పై దెబ్బ, ఆ తర్వాత పెట్రోల్-డీజిల్‌పై దెబ్బ అని రాహుల్ తెలిపారు.














Click it and Unblock the Notifications