మాలో చీలిక తెచ్చే ప్రయత్నం: దామోదర్ రెడ్డి

రేపటి రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి అత్యంత కీలకమైన సమావేశమని, ఈ సమావేశానికి తెలంగాణ నాయకులంతా హాజరు కావాలని ఆయన అన్నారు. జెఎసిలో చర్చించి రేపు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్ ప్రధానితో భేటీ వివరాలపై కూడా సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సూచించారని, దానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని సీమాంధ్ర నాయకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని, దాంతో వారు జలాలు, ఇతర విషయాలపై నిపుణుల కమిటీ వేసుకుని చర్చించుకుంటున్నారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. అన్నదమ్ముల్లా విడిపోదామని ఆయన సీమాంధ్ర నాయకులకు సూచించారు. సీమాంధ్ర నాయకులు, ప్రజలు సంక్రాంతి పర్వదినానికి తమ తమ ప్రాంతాలకు వెళ్లి సంతోషంగా తిరిగి రావాలని ఆయన ఆశించారు.












Click it and Unblock the Notifications